News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 22, 2026
‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్?

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సాంగ్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా స్పెషల్ సాంగ్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంటారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం మృణాల్ తెలుగులో అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ మూవీలో నటిస్తున్నారు.
News March 22, 2026
వివాదంలో జనగామ కలెక్టర్!

జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టి నెల రోజులు కానే లేదు వివాదాలు ఎదుర్కొంటున్నారు. వచ్చీరాగానే ప్రజావాణిలో ఓ వృద్ధుడి ధీనస్థితిని చూసి వైద్యం చేయించి ఆరంభంలో శభాష్ అనిపించుకున్నారు. కానీ కలెక్టరేట్ ఎదుట ఉన్న టీ, విజయ డెయిరీ స్టాళ్లను తొలగించాలన్న నిర్ణయం వివాదాస్పదమైంది. తాజాగా జనగణన కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనూ ఎంపికైనట్లు మెసేజ్‌లు పంపించి కొందరినే పరీక్ష అనుమతించడం గమనార్హం.
News March 22, 2026
మంచిర్యాల: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు

పదేళ్ల క్రితం ఆ కుటుంబాన్ని లారీ ప్రమాదం కోలుకోలేని దెబ్బ తీసింది. ఇంటి పెద్దను బలిగొన్న అదే మృత్యువు, కొడుకును కూడా అదే రూపంలో కబళించడం స్థానికులను కన్నీటిపర్యంతం చేసింది. జైపూర్ మం. టేకుమట్ల వంతెన వద్ద శనివారం <<19443353>>సాయంత్రం<<>> జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రామగుండానికి చెందిన పోరడ్ల సాయికుమార్(23) దుర్మరణం చెందాడు. రంజాన్ వేడుకలకు హాజరై వెళ్తుండగా లారీ అతివేగంగా వచ్చి సాయికుమార్‌ను పొట్టన పెట్టుకుంది.


