News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 14, 2026

సంగారెడ్డి: ఎస్సీలకు 409 యూనిట్లు మంజూరు

image

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంగారెడ్డి జిల్లాలోని షెడ్యూలు కులాల అభ్యర్థులకు 409 యూనిట్లు మంజూరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. లబ్ధిదారులకు రూ. 8.21 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా ఎస్సీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యమని, వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.

News March 14, 2026

IPLకు హర్షిత్ రానా దూరం?

image

ఈ నెల 28 నుంచి జరగనున్న IPL-2026కి టీమ్‌ఇండియా బౌలర్, KKR పేసర్ హర్షిత్ రానా దూరమైనట్లు నేషనల్ మీడియా పేర్కొంది. టీ20 WCకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో గాయపడిన ఆయన ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. గత రెండు సీజన్లలో KKR తరఫున రానా 34 వికెట్లు తీశారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌గా ఆకాశ్ మద్వల్, సిమర్జీత్ సింగ్‌తో పాటు మరికొంతమంది డొమెస్టిక్ బౌలర్ల పేర్లను KKR పరిశీలిస్తున్నట్లు సమాచారం.

News March 14, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.