News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 24, 2026

KNR: జీపీల్లో ‘నిధుల’ సెగ.. సర్పంచులు వర్సెస్ కార్యదర్శులు!

image

ఉమ్మడి KNR జిల్లాలోని జీపీల్లో నిధుల నిర్వహణ అంశం సర్పంచులు, కార్యదర్శుల మధ్య చిచ్చు పెడుతోంది. పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని జీపీ ఖాతాల్లో జమ చేయకుండా సర్పంచులు అడ్డుకుంటున్నారని కార్యదర్శులు ఆరోపిస్తుండగా.. తమకు అనుకూలంగా లేని వారిని బదిలీ చేయించాలని సర్పంచులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై ఎంపీడీవోలకు ఫిర్యాదులు అందుతుండగా, సమస్యను పంచాయతీరాజ్ శాఖ ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

News March 24, 2026

ఇరాన్ గ్యాస్ స్టేషన్‌పై దాడి.. ట్రంప్ ప్రకటన ఉత్తదేనా?

image

ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లపై 5 రోజుల పాటు దాడులు చేయబోమని ట్రంప్ నిన్న ప్రకటించినా వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. ట్రంప్ ప్రకటన తర్వాత ఇస్‌ఫహాన్ ప్రావిన్స్‌లోని నేచురల్ గ్యాస్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, గ్యాస్ స్టేషన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ప్రాణనష్టం లేకపోయినా పలు ఆస్తులు దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ టెన్షన్లతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 102-103 డాలర్లకు పెరిగింది.

News March 24, 2026

మేడారంలో వనదేవతల కానుకల లెక్కింపు

image

వనదేవతలు సమ్మక్క-సారలమ్మల హుండీ కానుకల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. మహాజాతర అనంతరం భక్తులు భారీగా తరలివచ్చి సమర్పించిన కానుకలతో గద్దెలపై ఉన్న సుమారు 30 హుండీలు నిండాయి. జాతర ఈఓ వీరాస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.