News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 5, 2026
నిర్మల్: రేపు ఇన్‌ఛార్జ్ మంత్రి వీడియో కాన్ఫరెన్స్

నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో రేపు ఉదయం 11 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు ఐడీఓసీల నుంచి పాల్గొంటారు.
News March 5, 2026
సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి: సీఎం

AP: డబ్బులు ఉన్న వారు ఎందుకు తక్కువ మంది పిల్లలను కంటున్నారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘ఇప్పటికీ పేదవారే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. అందుకే తల్లికి వందనం పథకం అందరికీ ఇచ్చాం. సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి. ఈ రోజుల్లో విడాకులు కూడా ఎక్కువ అయిపోయాయి. భార్యాభర్తలకు సహనం లేకుండా పోయింది. సామాజిక సమస్యలపై మనం మాట్లాడితేనే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది’ అని తెలిపారు.
News March 5, 2026
కామారెడ్డి: స్పోర్ట్స్ స్కూల్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

కామారెడ్డి జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించే లక్ష్యంతో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్ స్కూల్‌కు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. అర్హత కలిగిన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.


