News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 27, 2026

IPL షెడ్యూల్‌లో ఈ మార్పు గమనించారా?

image

గతంలో ఒక జట్టు తమ గ్రూపులోని మిగతా టీమ్స్‌తో 2 సార్లు తలపడింది. వేరే గ్రూప్‌లోని ఒక జట్టుతో రెండుసార్లు, మిగతావాటితో ఒకసారి ఆడింది. కానీ ఈసారి సొంత గ్రూప్‌లోని జట్లతో ఒకసారి, మరో గ్రూప్‌లోని జట్లతో రెండేసి సార్లు ఆడనున్నాయి. దీంతో MI-CSK రెండేసి సార్లు ఢీకొననున్నాయి. RCBతోనూ MI 2 మ్యాచులు ఆడనుంది. ఇది అభిమానులకు కనులవిందే.
గ్రూప్-A: CSK, KKR, RR, RCB, PBKS
గ్రూప్-B: MI, SRH, GT, DC, LSG

News March 27, 2026

NLG: చివరి మజిలీకి స్థలం కరువు.. హైవేపై మృతదేహంతో ధర్నా

image

అంతిమ సంస్కారాలకు ఆరడుగుల నేల కరువవ్వడంపై పెద్దవూరలో నిరసన వ్యక్తమైంది. గ్రామానికి చెందిన అత్యం అన్నపూర్ణ మృతి చెందగా, శ్మశాన వాటిక లేక దహన సంస్కారాలకు స్థలం దొరకలేదు. దీంతో ఆగ్రహించిన బంధువులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు శవంతో హైదరాబాద్-నాగార్జున సాగర్ హైవేపై ధర్నాకు దిగారు. సామాన్యుడి చివరి ప్రయాణానికి స్థలం కేటాయించలేని దుస్థితిపై వారు ప్రభుత్వ తీరును నిరసించారు.

News March 27, 2026

JGL: ఏప్రిల్ 10న కారు ఎక్కనున్న జీవన్ రెడ్డి..?

image

మాజీమంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసింది. ఏప్రిల్ 10న కారు పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు BRS నాయకురాలు తుల ఉమ జీవన్ రెడ్డిని కలిసి మాట్లాడారు. JGl శివారులో లేదా రూరల్ మం.లక్ష్మిపూర్‌లో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని, శనివారం సభా స్థలాన్ని కేటీఆర్, హరీష్ రావులు జీవన్ తోపాటు సభాస్థలిని పరిశీలించనున్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది.