News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 16, 2026

SSC ఎగ్జామ్స్ శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర పరిశీలకులుగా భానుమూర్తి

image

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు జిల్లా రాష్ట్ర పరిశీలకులుగా భానుమూర్తి రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం విజయవాడలోని ఓ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తుండగా..ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు.

News March 16, 2026

ALERT: మెదక్ జిల్లాలో నేడు భారీ వర్షాలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో మార్చి 16 నుంచి 21 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రైతులు తమ పంటలను కాపాడుకోవాలని, వర్షం సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించింది.

News March 16, 2026

సెలవులో చిత్తూరు కలెక్టర్

image

వ్యక్తిగత కారణాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు పెట్టారు. నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు సెలవులో వెళ్తున్నారు. తిరిగి ఆయన 21న విధులకు హాజరుకానున్నారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.