News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 12, 2026
మెదక్: టెన్త్ పరీక్షలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ కార్యాలయంలో 9848214166 కంట్రోల్ రూమ్ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పట్టుదల, క్రమశిక్షణతో చదివి మెదక్ జిల్లాను పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిపి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జిల్లాలో ఇందుకోసం మొత్తం 68 రెగ్యులర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News March 12, 2026
వదంతులను నమ్మవద్దు.. నిల్వలకు పాల్పడితే చర్యలు: ఎస్పీ

యుద్ధం నేపథ్యంలో నిత్యావసర సరుకుల కొరత ఏర్పడుతుందంటూ వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఎస్పీ సంకీర్త్ హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి వాటిపై దళారులు చేస్తున్న దుష్ప్రచారంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యాపారులు సరకులను అక్రమంగా నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 12, 2026
వనపర్తి: గెజిటెడ్ లెక్చరర్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

GLAT -2022 ( గెజిటెడ్ లెక్చరర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ) జిల్లా నూతన కార్యవర్గ కమిటీకి అధ్యక్షులుగా సంగి శెట్టి మల్లేష్, కార్యదర్శిగా టి.అనిల్ కుమార్ ని, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా GLAT 2026 నూతన క్యాలెండర్ వనపర్తి డీఐఈవో ఎర్ర అంజయ్య చేతుల మీదుగా విడుదల చేశారు. డీఐఈవో మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా చేయాలని సూచించారు.


