News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 16, 2026

GNT: రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ మృతి

image

విజయవాడ బైపాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గుంటూరుకు చెందిన ప్రదీప్ రాజ్ (41) ఏలూరులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పెనుగంచిప్రోలు నుంచి ఏలూరు వెళ్తుండగా పిల్లలకు టిఫిన్ తినిపించేందుకు కారు ఆపారు. తిరిగి బయలుదేరుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కళ్ల ముందే తండ్రి మరణించడంతో చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2026

శృంగవరపుకోట: అనారోగ్యంతో ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య

image

శృంగవరపుకోట మండలం తలారిలో విషాదం నెలకొంది. భవాని ఐటీఐలో 2వ సంవత్సరం చదువుతున్న చప్ప నందు (19) అనే విద్యార్థి అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 12న పురుగల మందు తాగిన నందును కుటుంబ సభ్యులు వెంటనే విశాఖ KGHకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం నందు మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2026

GNT: మిద్దెతోట సాగుదారులకు ఈ నెల 21న పురస్కారాలు

image

ప్రకృతిపై ప్రేమతో మిద్దెతోటలను పెంచుతున్న వారికి పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ ఈ నెల 21న పురస్కారాలు ప్రదానం చేయనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 30 మంది మిద్దెతోట పెంపకందారులను ఎంపిక చేశారు. వారికి పురస్కారాలు అందించనున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు.