News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 19, 2026

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం: కడప SP

image

కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక చర్యలపై కఠినంగా వ్యవహరించాలని SP నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు సబ్ డివిజన్ల పరిధిలో నేరాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 19, 2026

ప్రకాశం: ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 42 దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల (గ్రూప్-4: 12, క్లాస్-4: 30) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్ పోస్ట్‌లు ఉన్నాయి. అర్హులైన వారు ఏప్రిల్ 8 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.prakasam.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, దరఖాస్తులను ఒంగోలు కలెక్టరేట్‌లో సమర్పించాలని కలెక్టర్ రాజబాబు తెలిపారు.

News March 19, 2026

’10వ తరగతి హిందీ పరీక్షకు 84 మంది గైర్హాజర్’

image

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన 10వ తరగతి హిందీ పబ్లిక్ పరీక్షలకు 84 మంది గైర్హాజరయ్యారని 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జిల్లా అధికారి కొండూరు శ్రీనివాసరాజు తెలిపారు. జిల్లాలో మొత్తం 124 సెంటర్లలో 21,614 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 84మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు.