News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 23, 2026
పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు ఒప్పుకోలేదు: టీమ్

పవన్ కళ్యాణ్ కొత్తగా ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదని ఆయన ప్రొడక్షన్ టీమ్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ వెల్లడించింది. కొత్త ప్రాజెక్టుల గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కొత్త సినిమాలు ప్రారంభించే ప్లాన్ లేదని, ఏదైనా ఉంటే అఫీషియల్‌గా ప్రకటిస్తామని తెలిపింది. ‘OG-2’ సినిమా గురించి ఆయనే సరైన సమయంలో ప్రకటన చేస్తారని పేర్కొంది.
News March 23, 2026
కొత్తపట్నం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లాలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపట్నంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని RTC బస్సు ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయాడు. పడిపోయిన వ్యక్తిని బస్సు డ్రైవర్ గమనించక బస్సు తలపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 23, 2026
‘సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు.. అంతా ఫేక్’

రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టుకు ఈరోజు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై న్యాయమూర్తులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. BD, డాగ్ స్క్వాడ్‌తో గాలించగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది ఫేక్ మెయిల్‌గా తేలింది. కోర్టు చీప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (CAO) ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.


