News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 24, 2026
రాపూరు వస్తే.. అవకాశం ఎవరికి..!

కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో నెల్లూరు జిల్లాలో మరలా ఊహగానాలు మొదలయ్యాయి. 1952లో ఏర్పాటైన రాపూరు నియోజకవర్గం డీలిమిటేషన్లో భాగంగా 2008లో ఈ ప్రాంతం శాసనసభ స్థానాల నుంచి తొలగించబడింది. 1952 నుంచి 2004 వరకు జరిగిన ఎలక్షన్స్‌లో టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మరలా రాపూరు నియోజకవర్గాన్ని ప్రకటిస్తే రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది.
News March 24, 2026
ఎనిమిదేళ్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటా: CM రేవంత్

TG: దేశ రాజకీయాల్లో తాను పని చేయాలనేది పార్టీయే నిర్ణయిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. ఇంకా ఎనిమిదేళ్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని టీవీ9 సమ్మిట్‌లో స్పష్టం చేశారు. రావణుడు ఉన్నాడు కాబట్టే రాముడు పేరు గడించారని, తెలంగాణలో ఉన్న విలన్ల వల్లే ప్రజలు తనను హీరో చేశారని పేర్కొన్నారు. 2034 వరకు రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ ఉంటానన్నారు. తాను నాయకుడిని కాదని, కార్యకర్తల స్నేహితుడినని చెప్పారు.
News March 24, 2026
పీఎం పథకాలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్

పర్యావరణ హిత ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు ‘పీఎం సూర్య ఘర్’ (రూఫ్ టాప్ సోలార్), ‘పీఎం కుసుమ్’ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం దాదాపు ₹78,000 వరకు సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. దీనిని బ్యాంకర్లు తమ లోన్ పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన భాగంగా చేర్చుకోవాలని పేర్కొన్నారు.


