News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 16, 2026

GWL: ఫార్మర్ రిజిస్ట్రీ పక్కాగా ఉండాలి- కలెక్టర్

image

డిజిటల్ క్రాఫ్ట్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ పక్కాగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సోమవారం మండలంలోని గోనుపాడు శివారులో పంట పొలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంటల దిగుబడి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మరో నెల రోజుల్లో అన్ని పంటలు చేతికి వస్తాయని రైతులు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.

News March 16, 2026

పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు తప్పనిసరి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో పదవ తరగతి పరీక్ష గదులు విద్యార్థులకు అనుకూలంగా ఉండాలని, సరైన గాలీ, వెలుతురు ఉండేలా కిటికీలు, తలుపులు ఉండాలని కలెక్టర్ రాజకుమారి స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలను స్పెషల్ ఆఫీసర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు తమకు కేటాయించిన పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడాలని ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్లు, సరైన బెంచీలు, లైట్లు, ఫ్యాన్లు ఉండేలా చూడాలని తెలిపారు.

News March 16, 2026

GWL: నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- కలెక్టర్ రిజ్వాన్ భాషా

image

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని బస్తీ దవాఖానను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ రోగులకు వైద్యం అందుతున్న తీరును పరిశీలించారు. మెడిసిన్ స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.