News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 21, 2026

పిల్లి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య

image

హైదరాబాద్‌లో వేర్వేరు ఘటనల్లో పెంపుడు పిల్లుల కోసం ఇద్దరు విద్యార్థినులు తనువు చాలించడం విస్మయానికి గురిచేస్తోంది. పిల్లిని ఇంట్లోకి తేవొద్దన్నందుకు అల్వాల్‌కు చెందిన MBBS స్టూడెంట్ శ్రేష్ఠ నిన్న తల్లితో గొడవపడి సూసైడ్ చేసుకుంది. 3 రోజుల క్రితం మీర్‌పేట్‌లోనూ BSc విద్యార్థిని హిమబిందు పెంపుడు పిల్లి చనిపోయిందని ఆత్మహత్య చేసుకుంది. పెట్స్‌పై ప్రేమతో ప్రాణాలు తీసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

News March 21, 2026

రైతులకు గుడ్ న్యూస్: రేపటి నుంచే ఖాతాల్లోకి ‘రైతు భరోసా…!

image

గద్వాల జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సాగుకు సంబంధించి ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ఆదివారం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. జిల్లాలో తొలి విడతలో 1,69,299 మంది రైతులకు ఒక ఎకర భూమి రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 28 లోపు పాస్‌బుక్కులు పొందిన మరో 6 వేల మందికి కూడా ఈ అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 3.52 లక్షల ఎకరాలకు ఈ సాయం అందనుంది.

News March 21, 2026

ఏర్గట్ల: చిట్టి చేతులు..చక్కని కవితలు

image

నేటి తరం విద్యార్థులు సిలబస్ అనే చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారు. కానీ తడపాకల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చదవడం, రాయడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. కలాలు పట్టి తేలికపాటి పదాలతో అందరికీ అర్థమయ్యేలా కథలు, కవితలు రాసేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటి పురస్కారాలు, ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 15కి పైగా సంపుటులు ఆవిష్కరించారు.
# నేడు ప్రపంచ కవితా దినోత్సవం