News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 24, 2026

ముంబైకి సూర్యను కెప్టెన్ చేయాలి: అశ్విన్

image

MI కెప్టెన్సీని సూర్యకు అప్పగించాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల <<19453220>>మాజీ క్రికెటర్ శ్రీకాంత్<<>>, తాజాగా అశ్విన్ ఇవే కామెంట్స్ చేశారు. ‘హార్దిక్ మంచి నాయకుడే. కానీ MIకి వచ్చాక తొలి ఏడాది రోహిత్ వ్యవహారంతో గడిచిపోయింది. ప్రస్తుతం భారత T20 జట్టు కెప్టెన్ సూర్య IPLలో హార్దిక్ నాయకత్వంలో ఆడాలి. ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.
* MI కెప్టెన్‌గా ఎవరు బెటర్? కామెంట్ చేయండి.

News March 24, 2026

రూపాయి లాభం లేక.. రోజుకు రూ. కోట్లలో నష్టం

image

అంతర్జాతీయంగా యుద్ధ ప్రభావం, ఎగుమతులు నిలిచిపోవడంతో ఉమ్మడి జిల్లాలో కోడిగుడ్డు ధరలు పతనమై పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. ఒక్కో గుడ్డు ఉత్పత్తికి రూ.4.60 ఖర్చవుతుండగా, మార్కెట్‌లో కేవలం రూ.3.50 మాత్రమే పలుకుతుండటంతో రైతులకు ఒక్కో గుడ్డుపై రూ. 1.10 నష్టం వాటిల్లుతోంది. సుమారు 2000 పౌల్ట్రీ ఫామ్‌లలో ఉన్న 2 కోట్ల కోళ్ల ద్వారా రోజూ జరిగే ఉత్పత్తిపై రైతులకు నిత్యం రూ.కోట్లలో నష్టం వస్తోంది.

News March 24, 2026

తగ్గేదే లే.. యుద్ధం కొనసాగుతుంది: నెతన్యాహు

image

పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్‌పై దాడులకు US అధ్యక్షుడు ట్రంప్ బ్రేక్ ఇచ్చినా తాము మాత్రం ఆగేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్, లెబనాన్‌పై దాడులు కొనసాగుతాయన్నారు. కాగా దాడుల్లో సాధించిన విజయాలే డీల్‌లో పైచేయి సాధించడానికి కీలకం అవుతాయని భావిస్తున్నట్లు ట్రంప్ తనతో చెప్పారని తెలిపారు.