News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 18, 2026
హ్యాకథాన్‌కు క్రీడాకారులకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

వరల్డ్ తెలుగు ఐటి అసోసియేషన్ (WTIT) ఆధ్వర్యంలో ఈనెల 28, 29 తేదీల్లో HYD గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ హ్యాకథాన్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు జిల్లాలోని క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, లేదంటే 97365 60909, 63000 57052, 94408 46682 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
News March 18, 2026
మట్టి కుండలను వాడితేనే ఆరోగ్యం: సంగారెడ్డి కలెక్టర్

వేసవిలో మంచినీళ్ల కోసం మట్టికుండలను వాడితేనే ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టికుండలను కలెక్టర్ ప్రావీణ్యకు కార్యాలయంలో బుధవారం అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్ పాల్గొన్నారు.
News March 18, 2026
VZM: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, జిల్లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఉగాది వేడుకలను స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజలు పాల్గొనాలని కోరారు.


