News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 23, 2026
జగిత్యాల: ‘ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి’

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 46 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అర్జీలపై సమగ్ర విచారణ చేసి పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్ ఉన్నారు.
News March 23, 2026
మస్కట్‌లో కన్నుల పండుగగా వేములవాడ రాజన్న కళ్యాణం

గల్ఫ్ దేశమైన ఒమన్ రాజధాని మస్కట్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఒమన్ తెలంగాణ సమితి (ఓటిఎస్) ఆధ్వర్యంలో నగరంలోని శ్రీకృష్ణ మందిర ప్రాంగణంలో ఆదివారం శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఒమన్‌లో భారత రాయబారి జీవి శ్రీనివాస్, నిర్వాహకులు నూనె లక్ష్మణ్, పెద్ద సంఖ్యలో ప్రవాస తెలంగాణ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News March 23, 2026
యుద్ధం.. స్టాక్ మార్కెట్లలో కల్లోలం

పశ్చిమాసియా సంక్షోభంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 601.8 పాయింట్ల నష్టంతో 22,512 వద్ద, సెన్సెక్స్ 1,836 పాయింట్లు కోల్పోయి 72,696 వద్ద క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్‌లో అత్యధికంగా టైటాన్ 6.99%, ట్రెంట్ 6.21%, అల్ట్రాటెక్ 5.40%, భారత్ ఎలక్ట్రానిక్స్ 4.94%, టాటా స్టీల్ 4.93% నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 93.95కి పడిపోయి రికార్డు కనిష్ఠాలను తాకింది.


