News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 15, 2026
వనపర్తి జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

వనపర్తి జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. గత 24 గంటల్లో వెలుగొండ, కానాయపల్లిలో అత్యధికంగా 38.7°C ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దమందడి, మదనాపూర్లలో 38.6°C, గోపాల్‌పేటలో 38.4°Cగా రికార్డయ్యాయి. మార్చిలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు రాకూడదని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
News March 15, 2026
కామారెడ్డి: గ్యాస్ ‘నో స్టాక్’ బోర్డు

బిక్కనూరు మండల కేంద్రంలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న స్టాక్ పూర్తిగా కస్టమర్లకు పంపిణీ చేశామని, కొత్త నిల్వలు లేకపోవడంతో కార్యాలయం వద్ద ‘నో స్టాక్’ బోర్డు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు రమేష్ రెడ్డి తెలిపారు. గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చే వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. త్వరలోనే కొత్త స్టాక్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News March 15, 2026
డ్రగ్స్ వివాదంలో ‘పైలట్ రోహిత్’!

డ్రగ్స్ వినియోగిస్తారనే ఆరోపణలు పైలట్ రోహిత్ రెడ్డిపై వస్తూనే ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ కేసులో బెంగళూర్ పోలీసులు విచారణకు పిలిచారు. ఇప్పుడు తన ఫాంహౌస్‌లోనే డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇదే ఫాంహౌస్ వేదికగా జరిగింది. ఇప్పుడు డ్రగ్స్ పార్టీకి కూడా ఇదే వేదిక. దీంతో పైలట్‌తో పాటు ఆయన ‘ఫౌంహౌస్’ కూడా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.


