News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 5, 2026
భీమవరం: మహిళా దినోత్సవ నిర్వహణపై జేసీ సమీక్ష

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం విష్ణు కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేడుకల నిర్వహణకు ప్రత్యేక అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళా సాధికారత ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలు ఉండాలని ఆయన సూచించారు.
News March 5, 2026
MBNR: రేపు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశం

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కుష్బూ గుప్తా వెల్లడించారు. ఈ సమావేశంపై నేడు కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమావేశానికి ఇన్‌ఛార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా మంత్రులు హాజరు అవుతారని పేర్కొన్నారు.
News March 5, 2026
ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు: చంద్రబాబు

AP: ఇక నుంచి ‘ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు’ అని మాట్లాడాలని సీఎం CBN పిలుపునిచ్చారు. ‘ఫ్యామిలీ ప్లానింగ్ ఇప్పుడు అసంబద్ధం. జనాభా లేక ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువగా ఉంది. జనాభా తగ్గడం వల్ల రాజకీయంగా కూడా ఇబ్బందులు వస్తాయి. నేను రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడటం లేదు. ఏ దేశంలో ఎక్కువ జనాభా ఉంటే ఆ దేశం ధనిక దేశం అవుతుంది’ అని అసెంబ్లీలో చెప్పారు.


