News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 14, 2026

సూర్యాపేట: ప్రశాంతంగా ముగిసిన తెలుగు పరీక్ష

image

జిల్లాలో శనివారం పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈవో అశోక్ తెలిపారు. 69 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 12,355 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 12,342 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అధికారులు 37 కేంద్రాలను తనిఖీ చేశారని ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని, పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఈవో తెలిపారు.

News March 14, 2026

NDAతో పొత్తు ఉండదు: విజయ్

image

TNలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో NDAతో పొత్తు ఉండదని TVK చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. వారితో కలిసి పోటీ చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. పొత్తుపై జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలే అని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ ప్రకటించారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. BJP తమకు సైద్ధాంతిక శత్రువు అన్నారు. పార్టీ అధికారిక ప్రకటన ఇస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలని కార్యకర్తలకు సూచించారు.

News March 14, 2026

సిరిసిల్ల: నర్సరీని పరిశీలించిన కలెక్టర్

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలోని మూడవ వార్డులో నర్సరీని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ శనివారం పరిశీలించారు. ఏ మొక్కలు ఉన్నాయి..? ఎలా పెరుగుతున్నాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలకు ఎప్పటికప్పుడు నీరు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.