News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 16, 2026
బాపట్ల ఎస్పీ కార్యాలయానికి 59 అర్జీలు

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 59 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పూర్తిస్థాయి విచారణ జరిపి సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
News March 16, 2026
నటి ప్రత్యూష మృతి కేసు.. లొంగిపోయిన సిద్ధార్థ్

నటి ప్రత్యూష డెత్ <<19164468>>కేసులో<<>> నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతడికి హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. మార్చి 16వ తేదీలోగా లొంగిపోవాలని 4 వారాల క్రితం తీర్పునిచ్చింది. దీంతో అతడు ఈరోజు లొంగిపోయాడు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థ్ ప్రేరేపించినట్లుగా కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే.
News March 16, 2026
GWL: జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి- SP

ఈనెల 28న గద్వాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. రాజీమార్గమే రాజమార్గం అనే నినాదంతో నిర్వహించే కార్యక్రమంలో రాజీ పడదగ్గ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్నపాటి వివాదాలు, ట్రాఫిక్ చలాన్లు, క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, కుటుంబ సమస్యలు పరిష్కరించుకునే వీలుందన్నారు.


