News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 18, 2026
తిరుపతి: టెన్త్ పరీక్షలకు 213 మంది గైర్హాజరు

తిరుపతి జిల్లాలో మంగళవారం 10వ తరగతి హిందీ పరీక్ష జరిగింది. జిల్లాలో 26,683 మంది విద్యార్థులకు గాను 26,470 మంది హాజరయ్యారు. 213 మంది గైర్హాజరైనట్లుDEO కేవీఎన్ కుమార్ చెప్పారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 892 మందికి గాను 786 హాజరయ్యారు. 106 మంది పరీక్షలకు రాలేదు.
News March 18, 2026
ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి హిందీ పరీక్ష

ఖమ్మం జిల్లావ్యాప్తంగా పదో తరగతి హిందీ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 16,990 మంది విద్యార్థులకు గానూ 16,972 మంది హాజరయ్యారని, 99.89 శాతం హాజరు నమోదైనట్లు డీఈవో చైతన్య జైనీ తెలిపారు. పరీక్షా కేంద్రాలను డీఈవోతో పాటు ఏసీజీఈ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ముమ్మరంగా తనిఖీ చేశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
News March 18, 2026
IPL: ఈసారి ‘క్యాప్’ పెట్టుకునేదెవరో?

సీజన్‌లో అత్యధిక రన్స్, వికెట్లు తీసిన ప్లేయర్లకు ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు ఇస్తారు. గత 5 సీజన్లలో ఒక్కసారి(బ్యాటింగ్ విభాగంలో) మినహా అన్నీ ఇండియన్సే దక్కించుకున్నారు. 2021లో రుతురాజ్(635 రన్స్), హర్షల్ పటేల్(32 వికెట్లు), 2022లో బట్లర్(863), చాహల్(27), 2023లో గిల్(890), షమీ(28), 2024లో కోహ్లీ(741), హర్షల్(24), 2025లో సుదర్శన్(759), ప్రసిద్ధ్(25) గెలిచారు. ఈ సారి ఎవరిని వరిస్తాయనుకుంటున్నారు?


