News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 13, 2026
అన్నమయ్య: పదో తరగతి హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్

పదో తరగతి విద్యార్థుల సౌకర్యార్థం హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు శుక్రవారం అన్నమయ్య జిల్లా పదో తరగతి పరీక్షల అధికారి కొండూరు శ్రీనివాసరాజు తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, టైం టేబుల్ వస్తుందన్నారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
News March 13, 2026
జగిత్యాల: ‘రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి’

రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని లాభదాయకమైన పంటలను వేయాలని అన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ లు బిఎస్ లత, రాజా గౌడ్, అధికారులు పాల్గొన్నారు.
News March 13, 2026
జీతాల్లేక ‘108’ సిబ్బంది ఇబ్బందులు !

ఆపదలో ప్రాణాలు కాపాడే 108 సర్వీసుల నిర్వహణ భారంగా మారింది. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో అంబులెన్స్‌ల నిర్వహణకు ఆటంకం కలుగుతోంది. గత కొన్ని నెలలుగా సిబ్బందికి జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవలపై ప్రభావం పడకముందే ప్రభుత్వం స్పందించి, వెంటనే బకాయిలు విడుదల చేయాలని 108 ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.


