News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 19, 2026
VJA: బ్లడ్ క్యాన్సర్‌తో ASI గోపి మృతి?

పటమట PSలో ASIగా పనిచేస్తున్న గోపి మృతిపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, చికిత్స పొందుతున్న క్రమంలోనే మృతి చెందారని ఆయన కుమారుడు శరత్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం కారణంగా తరచూ కళ్లు తిరిగి పడిపోయేవారని, ఈ క్రమంలోనే పెద్దపులిపాక కట్ట వద్ద ప్రాణాలు కోల్పోయారన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 19, 2026
పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

సాధారణ అర్థంలో పరాభవ అంటే అవమానం, ఓటమి. దీని ప్రకారం ఈ సంవత్సరమంతా అపజయాలు ఉంటాయని కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించి ధర్మబద్ధంగా కష్టపడేవారికి విజయాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పరా-అమ్మవారు, భవ-ఉండు/ఆవిర్భావం/శివుడు అనే అర్థం. అంటే అమ్మవారికి సమీపాన ఉండటం లేదా పరాశక్తి ఆవిర్భావం లేదా అర్ధనారీశ్వర తత్వం అని కూడా అంటారు’ అని పేర్కొంటున్నారు.
News March 19, 2026
అనంత: రూ.1.30 కోట్లకు పైగా పంట నష్టం

అనంతపురం జిల్లాలో ఈదురుగాలుల తాకిడికి ఉద్యాన, వ్యవసాయ పంటలు చెల్లాచెదురైన పరిస్థితి నెలకొంది. కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, ఆత్మకూరు, గార్లదిన్నె, శింగనమల తదితర మండలాలలో 65 ఎకరాలలో అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రూ.1.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్నతో పాటు ఇతర ఉద్యాన పంటల నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు.


