News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 22, 2026
NLG: నాడు ఫ్లోరైడ్ కన్నీళ్లు.. నేడు కృష్ణా జలాలు..!

దశాబ్దాల పాటు ఫ్లోరైడ్ రక్కసితో తల్లడిల్లిన నల్గొండ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామాగా మారింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత కృష్ణా జలాలు అందుతుండటంతో ఈ మహమ్మారి పూర్తిగా అంతమైంది. జిల్లాలో కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్రం సైతం పార్లమెంటులో ధ్రువీకరించింది. ఒకప్పుడు కలుషిత నీటితో అల్లాడిన ఆ నేల నేడు పచ్చని మాగాణిగా రూపుదిద్దుకుంది. నేడు ప్రపంచ జల దినోత్సవం.
News March 22, 2026
సబ్బితం గ్రామంలో మిన్నంటిన మతసామరస్యం

పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో మతసామరస్యం వెల్లివిరిసింది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని హనుమాన్ దీక్షాపరులు ముస్లిం కుటుంబాలను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి స్వీట్లు పంపిణీ చేసి తమ సోదరభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, హనుమాన్ మాలధారులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా అందర కలిసి పండుగ జరుపుకొన్నారు.
News March 22, 2026
కుల మీటింగ్స్‌కు వెళ్తే తప్పేంటి?: హైడ్రా కమిషనర్

కుల సమావేశాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ‘భారతదేశంలో కులాన్ని విడదీయలేం. మంచి విషయాల కోసమే వెళ్తున్నాను’ అని స్పష్టం చేశారు. తనకు పబ్లిసిటీ పిచ్చి లేదని కేవలం ప్రజల్లో అవగాహన కోసమే ఇంటర్వ్యూలు ఇస్తున్నానని చెప్పారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన తమ ఇంటికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని తెలిపారు.


