News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 14, 2026

గ్యాస్ కొరత వార్తలు అవాస్తవం: సీఐ జయనాయక్

image

రాయదుర్గంలో గ్యాస్ కొరతతో హోటళ్లు వారం రోజుల పాటు బంద్‌ అయ్యాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని సీఐ జయనాయక్ స్పష్టం చేశారు. పట్టణానికి సంబంధం లేని ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా సాధారణంగానే ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 14, 2026

ఉమ్మడి ప్రకాశం: 10th విద్యార్థులకు SP సూచన

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ నెల 16 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 108 కేంద్రాల్లో 10 పరీక్షలు జరుగుతున్నాయని, పరీక్షలు సజావుగా జరిగేందుకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏవైనా ఘటనలు జరిగితే డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.

News March 14, 2026

యాదాద్రి: ‘ఆర్డర్ టు సర్వ్’పై పోలీసుల ఆవేదన..!

image

జీవో 317లో భాగంగా భువనగిరి జిల్లాకు బదిలీపై వచ్చిన పోలీసులను ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ప్రాంతాలకు ‘ఆర్డర్ టు సర్వ్’ పేరుతో మళ్లీ బదిలీ చేస్తారన్న సమాచారంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలకు దూరమై మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. మహిళా సిబ్బంది పిల్లల సంరక్షణ, వృద్ధ తల్లిదండ్రుల చూసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.