News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 20, 2026

KNR: కౌశిక్‌కు సీపీ TARGET.. లైట్ తీసుకున్న GOVT

image

హుజూరాబాద్ MLA కౌశిక్ రెడ్డి KNR CPని టార్గెట్ చేయడం రాజకీయాల్లో అగ్గిని రాజేస్తోంది. అసెంబ్లీలోనూ CPపై ఆరోపణలు చేస్తూ సిట్ వేయాలని డిమాండ్ చేయడం విధితమే. అయితే ఈ అంశాన్ని ప్రభుత్వం లైట్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రాధాన్యం లేని అంశాలను కౌశిక్ అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారని పోలీసుల సంఘం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. CP అవినీతిని బయటపెట్టి, సస్పెండ్ అయ్యే వరకు వదలబోనని కౌశిక్ అనడం గమనార్హం.

News March 20, 2026

కొత్త ఫోన్లలో ఆధార్ యాప్?

image

కొత్త మొబైల్స్‌లో డిఫాల్ట్‌గా ఆధార్ యాప్‌ను తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. యూజర్లు న్యూ మొబైల్ ఆన్ చేసినప్పుడే ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆధార్ దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చని కేంద్రం చెబుతోంది. ఈ మేరకు స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఈ ఏడాది జనవరిలో ఈ-మెయిల్ చేసింది. అయితే ఈ ప్రతిపాదనను యాపిల్, శామ్‌సంగ్, గూగుల్ తిరస్కరించాయి.

News March 20, 2026

తెలంగాణ తలసరి ఆదాయం ₹4,18,931

image

* రెవెన్యూ వ్యయం: ₹2,34,406 కోట్లు
* మూలధన వ్యయం: ₹47,267 కోట్లు
* తలసరి ఆదాయం: ₹4,18,931 (జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే 1.9% ఎక్కువ)
* రాష్ట్ర వృద్ధి రేటు: 10.2% (జాతీయ వ‌ృద్ధి రేటు కంటే 2.7% ఎక్కువ)
* GSDP: ₹17.82 లక్షల కోట్లు