News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 8, 2026
ప్రభుత్వ డెంటల్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడలోని ప్రభుత్వ డెంటల్ కళాశాల, ఆసుపత్రిలో 2 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. డెంటల్ టెక్నీషియన్, డెంటల్ మెకానిక్ పోస్టులు ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తున్నామని, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 12లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరావు తెలిపారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ నియామకాలు చేపడతామని, వివరాలకై https://gdchvja.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలన్నారు.
News March 8, 2026
నిర్మల్: మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: ఎస్పీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదివారం మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆమె కొనియాడారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని ఎస్పీ పేర్కొన్నారు. మహిళల రక్షణ మరియు సాధికారతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
News March 8, 2026
NLG: ఆర్టీసీ ప్రగతి చక్రంలోనూ నారీశక్తి..!

TG-RTC అభ్యున్నతిలో మహిళా ఉద్యోగులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో మహిళా సిబ్బంది తమ పనితీరుతో సంస్థకు ఆదాయ వనరులుగా మారారు. 7 డిపోలలో కలిపి మొత్తం 328 మంది మహిళలు విధుల్లో ఉన్నారు. వీరిలో 308 మంది కేవలం కండక్టర్లుగానే సేవలందిస్తూ బస్సులను లాభాల బాటలో నడిపిస్తున్నారు. అత్యధికంగా నల్గొండ డిపోలోనే 80 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తుండటం విశేషం.


