News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 5, 2026

పార్వతీపురం: ఇంటర్‌ బోటనీ పరీక్షకు 392 మంది గైర్హాజరు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోటనీ పరీక్షకు 392 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DVEO నాగేశ్వరరావు గురువారం తెలిపారు. జనరల్ విద్యార్థులు 2282 మందికి 63 మంది గైర్హాజరు అయ్యారని చెప్పారు. ఒకేషనల్ విద్యార్థులు 2914 మందికి గానూ 329 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5196 మంది విద్యార్థులకు 392 మంది గైర్హాజరు అయ్యారని అన్నారు

News March 5, 2026

పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్

image

ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాలో జరగబోయే పదో తరగతి పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలలో అన్ని వసతులను ఒకరోజు ముందుగానే పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు.

News March 5, 2026

విశాఖ: కొత్త రైల్వే జోన్.. సిబ్బంది విభజనలో చిక్కులు

image

విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో ఉద్యోగుల విభజన వివాదంగా మారుతోంది. దక్షిణ మధ్య రైల్వే నుంచి 259 అకౌంట్స్, 699 ఇతర పోస్టులను HRMS ద్వారా బదిలీ చేశారు. అయితే సీనియారిటీ కోల్పోతామనే భయంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ హద్దుల మార్పులతో 2,000 మంది ప్రభావితం కానున్నారు. జోన్ ప్రధాన కార్యాలయానికి చెందిన 279 మంది ‘రివర్స్ ఆప్షన్’ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.