News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 21, 2026

కృష్ణా: జేసీ హెచ్చరిక

image

జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ శుక్రవారం హెచ్చరించారు. జిల్లాలో ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్నారు. ప్రజల్లో నెలకొన్న అలజడి కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (08672-252493) ఏర్పాటు చేశామన్నారు.

News March 21, 2026

VJA: దారుణం.. తినుబండారాల ఆశ చూపి ఇద్దరు బాలికలపై అత్యాచారం!

image

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. పటమట ప్రాంతానికి చెందిన మతిస్తిమితం లేని ఇద్దరు బాలికలను అదే ప్రాంతానికి చెందిన వెంకట శ్రీనాథ్ అనే వ్యక్తి తినుబండారాలు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘనటపై బాలిక కుటుంబ సభ్యులు పటమట పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరు బాలికలను పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేశారు.

News March 21, 2026

ప.గో: అలర్ట్.. దరఖాస్తుల ఆహ్వానం

image

ప.గో జిల్లాలో పర్యాటక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో టూరిజంపై మాట్లాడిన ఆమె, టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగలవారు ceo-apta@ap.gov.in మెయిల్ ఐడీకి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.