News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 8, 2026
KMR: పదో తరగతి విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమం: డీఈవో

పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, కమిషనర్ నవీన్ నికోలస్ సోమవారం ఉదయం 10.30 నుంచి 12.30గం.ల వరకు T-SAT ద్వారా మోటివేషనల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఈవో రాజు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు వీక్షించేలా జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యాధికారులు ఆయా పాఠశాలను పర్యవేక్షించాలన్నారు.
News March 8, 2026
వనపర్తి: వ్యభిచార గృహంపై దాడి.. ఆరుగురి అరెస్ట్

వ్యభిచార గృహంపై దాడి చేసిన ఘటన వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. వనపర్తి పట్టణంలోని కేడిఆర్ నగర్‌కు చెందిన నారమ్మ, బాలస్వామి, రమేశ్‌లు కలిసి ఓ ఇంట్లో మహిళల చేత వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
News March 8, 2026
6 నెలల పాటు యుద్ధానికి సిద్ధం: IRGC

ఇరాన్-ఇజ్రాయెల్, US యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. 6 నెలల పాటు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) స్టేట్ మీడియాకు వెల్లడించింది. ఇక అమెరికాతో యుద్ధంపై చర్చలకు వెళ్లబోమని ఇరాన్ ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ఆ దేశంపై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అటు శనివారం 300 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.


