News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 19, 2026
MHBD: ఉగాది వేళ ప్రేమ పెళ్లి!

MHBD(D) గార్ల(M) పినిరెడ్డిగూడెంలో కొండలమ్మ దేవాలయం ఓ అరుదైన ఘట్టానికి వేదికైంది. ఆలయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓ యువజంట ఇక్కడ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గ్రామానికి చెందిన సాయి, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన పావని ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, వందలాది మంది భక్తుల సమక్షంలో ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుంచి నేటి వరకు ఇక్కడ వివాహం జరగడం ఇదే ప్రథమం.
News March 19, 2026
‘గాంధారి వాన’ అంటే ఏమిటి?

అవసరం లేనప్పుడు కురిసే వర్షాన్ని ‘గాంధారి వాన’ అంటారు. ప్రస్తుతం పడుతోంది ఇలాంటి వర్షమే. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి కావడంతో భార్య గాంధారి తానూ కళ్లకు గంతలు కట్టుకొని 100 మంది కొడుకుల అకృత్యాలను చూడకుండా అమితమైన ప్రేమను కురిపించారు. దీంతో బిడ్డలంతా మరణిస్తారు. ఇలాగే అదును కాని వర్షంతో పంటలు నాశనమవుతాయి. ‘గాంధారి వాన’ ప్రస్తావన నాని నటించిన ఓ సినిమా పాటలో ఉంది. తెలిస్తే కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 19, 2026
సీఎం చేతులో ఉగాది పురస్కారం అందుకున్న ముక్కాముల వాసి

ముక్కామలకు చెందిన ప్రముఖ గరగ నృత్యం కళాకారుడు పసుపులేటి అయ్యప్పస్వామి ఉగాది పురస్కారం అందుకున్నారు. అమరావతిలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో గురువారం సీఎం చంద్రబాబు నాయుడు అయ్యప్ప స్వామికి ఉగాది పురస్కారం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సృజనాత్మకత, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు కళాకారుడు అయ్యప్ప స్వామికి ప్రశంసా పత్రం అందించి సత్కరించారు.


