News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 22, 2026
వికారాబాద్ జిల్లాలో ఫైర్ యాక్సిడెంట్స్ REPORT

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 2026 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 61 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనల్లో ఆస్తి నష్టం గణనీయంగా నమోదైనట్లు తెలిపారు. ప్రజలు ఫైర్ యాక్సిడెంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫైర్ సేఫ్టీ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
News March 22, 2026
సిద్దిపేట: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

సిద్దిపేట రమాదేవి ఆసుపత్రిలో ఓ మహిళ ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చింది. ఖాదర్‌పురాకు చెందిన ఖాలిద్ బిన్ సవుద్ దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టారు. శిశువులు వరుసగా 3 కేజీలు, 2.5 కేజీలు, 2 కేజీల బరువుతో జన్మించారని, ప్రస్తుతం తల్లితో పాటు ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబీకులు తెలిపారు.
News March 22, 2026
ఆదిలాబాద్: గడప దాటితే నీటి యుద్ధమే

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటి సమస్య కేవలం ఒక వార్తాంశం కాదు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అక్కడి ప్రజల ప్రతిరోజూ సాగే కన్నీటి పోరాటం. ఎండ వేడిమి పెరిగే కొద్దీ, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నీటి చుక్క కోసం పడే ఆరాటం వర్ణనాతీతం. మారుమూల గ్రామాల్లో గడప దాటగానే మొదలయ్యే నీటి వేట, వారి కష్టాలను ప్రతిబింబిస్తోంది. దీంతో ఎండాకాలంలో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే మేలు.


