News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 23, 2026
పెద్దపల్లి: ‘ఈనెల 31 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు’

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈనెల 31 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇప్పటికే 18 కేంద్రాలలో శిబిరాలు నిర్వహించామని, మిగిలిన కేంద్రాలలో ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని వెల్లడించారు. 24 రెసిడెన్షియల్ పాఠశాలల వద్ద క్యాంపులు నిర్వహించామని తెలిపారు.
News March 23, 2026
దృశ్యం-3 రిలీజ్ వాయిదా

మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న దృశ్యం-3 సినిమా విడుదల వాయిదా పడింది. తన పుట్టిన రోజైన మే 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మోహన్‌లాల్ ఇన్‌స్టాలో వెల్లడించారు. ఈ మూవీని ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 1, 2 చిత్రాలు సూపర్ హిట్ కాగా, వాటికి కొనసాగింపుగా మూడో భాగం వస్తోంది.
News March 23, 2026
విశాఖ: యాక్సిడెంట్.. తల్లి కళ్ల ఎదుటే కుమార్తె మృతి

పాత గాజువాక జంక్షన్‌లో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. కొరమండల్ ప్రాంతానికి చెందిన తల్లి కూతుర్లు స్కూటీపై వెళుతుండగా లారీ ఢీకొనడంతో కుమార్తె మల్లపురెడ్డి స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో గాజువాక జంక్షన్‌లో కలకలం రేగింది. కళ్ల ఎదుట కూతురు చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లి పోయింది. ఈ ప్రమాదంలో తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


