News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 20, 2026
లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వివిధ శాఖల లక్ష్యాలను ఈనెల 25 లోగా నూరుశాతం పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా సంఘాల రుణ లక్ష్యాలతో పాటు, ఆ నిధులతో ఉపాధి యూనిట్ల స్థాపనపై దృష్టి సారించాలన్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధి రుణాల మంజూరు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
News March 20, 2026
ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ తేదీల్లో మార్పు: పల్నాడు డీఈవో

ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ కార్యక్రమం తేదీల్లో మార్పు చేసినట్లు జిల్లా డీఈఓ నీలావతి దేవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మార్చి 21న ప్రారంభం కావాల్సిన ఉండగా..మార్చి 22న నుంచి మొదలవుతాయన్నారు. స్పాట్ వాల్యుయేషన్ ఆర్డర్స్ పొందిన ప్రిన్సిపాల్స్, జూనియర్ లెక్చరర్లు, PGTలు 22న ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు హాజరు కావాలని సూచించారు.
News March 20, 2026
చిత్తూరు: మూతపడుతున్న పెట్రోల్ బంకులు

బంకులకు పెట్రోల్ సరఫరా తగ్గడంతో స్టాక్ లేక పలు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండగా స్టాక్ త్వరగా అయిపోతుంది. అయితే ఇందన సరఫరా ఆలస్యం అవుతుండడంతో స్టాక్ లేక పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. హైవేపై ఉన్న బంకుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.


