News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 14, 2026
పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీ.ఏ., బీ.కామ్, బీఎస్‌సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీఏ(ఎల్) (సీబీసీస్) కోర్సులకు సంబంధించిన II, IV & VI సెమిస్టర్ (రెగ్యులర్/బ్యాక్‌లాగ్/ఇంప్రూవ్‌మెంట్) పరీక్షల నోటిఫికేషన్‌ను పరీక్షల నియంత్రణాధికారి డా కె ప్రవీణ విడుదల చేశారు. విద్యార్థులు పరీక్ష ఫీజు, దరఖాస్తు ఫారమ్‌లను ఈనెల 30 లోపు, రూ.300 ఆలస్య రుసుంతో వచ్చే నెల 4 వరకు తమ కళాశాలల్లో చెల్లించవచ్చని తెలిపారు.
News March 14, 2026
ఒక్కరోజే 2,37,123 గ్యాస్ సిలిండర్ల పంపిణీ

TG: డొమెస్టిక్ సిలిండర్ల డెలివరీకి సమస్య రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 2,37,123 గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయ్యాయి. సాధారణంగా జరిగే రోజువారీ సగటు పంపిణీ కంటే ఇది 12K సిలిండర్లు అధికం కావడం విశేషం. IOCL 83,166, HPCL 88,257, BPCL 65,700 గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశాయి. GOVT కఠిన చర్యల ఫలితంగా బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్టపడింది.
News March 14, 2026
ఖమ్మం ఎంపీకి అంతర్జాతీయ గౌరవం

ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్–స్విట్జర్లాండ్ ‘పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్’ సభ్యుడిగా ఆయనను లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేశారు. 18వ లోక్‌సభ కాలానికి గానూ రెండు దేశాల మధ్య పార్లమెంటరీ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ గ్రూపును ఏర్పాటు చేసినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. ఈ నియామకంపై జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


