News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 27, 2026
ఖమ్మం: వరి కోతకు వచ్చి గుండెపోటుతో డ్రైవర్ మృతి

నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. వరి కోత మిషన్‌తో పనుల కోసం వచ్చిన ఓ డ్రైవర్, స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పనుల కోసం వచ్చి అనంత లోకాలకు వెళ్లడంతో తోటి కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు.
News March 27, 2026
‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
<<7337592828>>Click on Whatsapp <<>>
News March 27, 2026
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక పూర్తి

ఏలూరు ఆశ్రమం మెడికల్ కళాశాల మైదానంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్ 19, అండర్ 23 బాలుర క్రికెట్ జట్ల ఎంపిక జరిగింది. ఎంపిక పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అండర్ 23 జట్టులో 23 మంది సభ్యులు, అండర్ 19 జట్టులో 16 మంది సభ్యులను సెలెక్టర్లు ఎంపిక చేశారు. వీరు త్వరలో మూలపాడులో జరగబోయే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని సెలెక్టర్ శ్రీనివాసరాజు వెల్లడించారు.


