News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 13, 2026

పదో తరగతి పరీక్షలు.. గిరిజన విద్యార్థులు 3,628 మంది

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమయ్యారని పీవో రాహుల్ తెలిపారు. 92 విద్యాసంస్థల నుంచి 3,628 మంది విద్యార్థులు రేపటి నుంచి పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. 56 ఆశ్రమ పాఠశాలలు, 21 వసతిగృహాలు, 12 గురుకులాలు, 3 బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారన్నారు. మొత్తం బాలురు 1,689 కాగా, బాలికలు 1,939 మంది హాజరవుతున్నట్లు వివరించారు.

News March 13, 2026

68.56 శాతం పూర్తయిన ఓటర్ల జాబితా మ్యాపింగ్

image

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 68.56 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

News March 13, 2026

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలి: డీఈవో

image

పదో తరగతి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని డీఈఓ సిద్ధార్థ రెడ్డి అన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ లో సూచనలు చేశారు. 3,290 మంది విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఒరిజినల్ హాల్ టికెట్ పోగొట్టుకుంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌ను అనుమతి ఇస్తామన్నారు.