News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 17, 2026

సంక్షేమ వసతి గృహాలపై కృష్ణా కలెక్టర్ సమీక్ష

image

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల పురోగతిపై మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో సమీక్షించారు. 61 హాస్టళ్ల అభివృద్ధికి రూ.10.35 కోట్లు మంజూరు కాగా, రూ.5 కోట్లతో 46 హాస్టళ్లలో పనులు పూర్తయ్యాయన్నారు. తాగునీరు, ఆహార నాణ్యతపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

News March 17, 2026

NTR: బీ.టెక్ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలో డిసెంబర్ 2025లో నిర్వహించిన III/IV బీ.టెక్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://nagarjunauniversity.ac.in/examcell/results ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.

News March 17, 2026

డీఎంకే బెదిరించిందని ఆరోపణలు.. స్పందించిన రజినీకాంత్

image

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో డీఎంకే ఆయన్ను బెదిరించిందని టీవీకే నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రజినీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆధవ్ అర్జున వ్యాఖ్యల్లో నిజం లేదు. ఆయన వ్యాఖ్యలను ఖండించి నాకు మద్దతుగా నిలిచిన నేతలకు, అభిమానులకు ధన్యవాదాలు. కాలం మాట్లాడకపోవచ్చు. కానీ వేచి ఉండి సమాధానం ఇస్తుంది’ అని పేర్కొన్నారు.