News March 29, 2024

కోహ్లీ, గంభీర్ ఫొటోలు షేర్ చేసిన KKR

image

కోల్‌కతా నైట్ రైడర్స్ సోషల్ మీడియా హ్యాండిల్లో ఆసక్తికరమైన ఫొటోలు షేర్ చేసింది. ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్, ఆర్సీబీ ఆటగాడు కోహ్లీ ఉన్న ఫొటోను పంచుకుంది. ఒకదాంట్లో కోహ్లీని, మరో దాంట్లో గౌతీని హైలైట్ చేసింది. అయితే.. ఐపీఎల్‌లో వీరిద్దరి మధ్య పలుమార్లు మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు RCBతో KKR మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు ఈ ఫొటో షేర్ చేసింది.

Similar News

News April 4, 2026

12 లక్షల కుటుంబాలకు సంతానం లేమి: మంత్రి

image

APలో 12 లక్షల కుటుంబాలు సంతాన వైఫల్యంతో ఇబ్బంది పడుతున్నాయని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. అలాంటి కుటుంబాలకు దేశంలోనే తొలిసారిగా సంతానోత్పత్తి వైద్య సేవల్ని ఉచితంగా అందిస్తామని తెలిపారు. శిశు సంరక్షణలో తల్లికే ప్రధాన బాధ్యత ఉంటోందని.. దీనిలో మార్పు రావాలన్నారు. మెటర్నటీ, పెటర్నిటీ లీవ్‌లతో పేరెంట్స్‌కు సమాన బాధ్యత ఉండేలా చూస్తామని చెప్పారు. శిశు, వృద్ధుల సేవలకు వీలుగా కోర్సులు తెస్తామన్నారు.

News April 4, 2026

నేను గంగూలీని కాదు.. కానీ బెంగాలీనే: లియాండర్ పేస్

image

తాను బెంగాలీ కాదంటూ వస్తున్న విమర్శలపై టెన్నిస్ దిగ్గజం, బీజేపీ నేత లియాండర్ పేస్ ఘాటుగా స్పందించారు. ‘నువ్వు బెంగాలీనేనా’ అని ఎవరైనా అడిగితే బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా పేరు గంగూలీ కాకపోవచ్చు. కానీ నేను బెంగాలీనే. మా నాన్నది పోర్చుగీస్ కావచ్చు. నేను ఈ దేశానికి చెందిన వాడినే. కోల్‌కతాలోనే పుట్టాను. సౌత్ క్లబ్‌లో నా టెన్నిస్ జర్నీ మొదలైంది’ అని చెప్పుకొచ్చారు.

News April 4, 2026

15వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!

image

త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CGL-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. దాదాపు 15వేల అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్), ఎస్సై, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తదితర గ్రూప్-B, C పోస్టులు ఉన్నాయి. దీనికి డిగ్రీ అర్హత ఉండాలి. నోటిఫికేషన్ విడుదల అయ్యాక దరఖాస్తు తేదీలు వెల్లడించనున్నారు.