News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 13, 2026

ఇరాన్‌లో ఈరోజు ఏం జరుగుతుందో చూడండి: ట్రంప్

image

ఇరాన్‌పై నేడు విరుచుకుపడనున్నట్లు అమెరికా హింట్ ఇచ్చింది. ఈరోజు ఏం జరుగుతుందో చూడండని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌కు నేవీ, ఎయిర్ ఫోర్స్ లేవని.. మిసైల్స్, డ్రోన్లను కూడా ధ్వంసం చేస్తున్నామన్నారు. US అంచనా తప్పిందన్న కథనాలకు కౌంటర్ ఇస్తూ.. వాటిని చదివి అమెరికా ఓడిపోతోందని భ్రమపడొద్దని ప్రజలకు సూచించారు. 47ఏళ్లుగా అమాయకులను చంపుతున్న వారిని US 47వ అధ్యక్షుడిగా అంతం చేయడం తనకు దక్కిన గౌరవమన్నారు.

News March 13, 2026

VZM: ‘అక్షరాంధ్ర పరీక్షకు 99% హాజరు కావాలి’

image

ఈనెల 15న నిర్వహించనున్న అక్షరాంధ్ర ఫైనల్ పరీక్షకు 99% హాజరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం టెలీకాన్ఫిరెన్స్‌ ద్వారా పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో 1.10 లక్షల మందిని అక్షరాంధ్ర కింద గుర్తించామని, వారందరూ అక్షరాస్యులుగా మారాలని అన్నారు. పరీక్ష అనంతరం మూల్యాంకనం చేసి మార్కులను యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.

News March 13, 2026

HYD: ఇంటిపై కూరగాయల సాగు నేర్చుకుంటారా?

image

జంటనగరాల్లో ఇంటి పైకప్పులు, బాల్కనీలో కూరగాయలు పెంచాలనుకునే వారికి ఉద్యానశాఖ శిక్షణ ఇవ్వనుంది. అర్బన్ ఫార్మింగ్ పథకం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అర్బన్ ఫార్మింగ్ విభాగం సంచాలకులు రామలక్ష్మి తెలిపారు. ఈ శిక్షణ మార్చి 14న నాంపల్లిలోని ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఉ.10 గంటల నుంచి మ.ఒంటి గంట వరకు జరుగుతుంది. వివరాలకు 8977714411 ఈ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.# SHARE IT