News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 16, 2026
కరీంనగర్ ప్రాజెక్టులకు బడ్జెట్ మోక్షం కలిగేనా..?

కరీంనగర్ నగరానికి మణిహారాలైన కేబుల్ బ్రిడ్జి అనుబంధ పనులు, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత వస్తుందని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. అటు కరీంనగర్-వీణవకం రహదారి విస్తరణ, మరమ్మతులు, కల్వల ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు కూడా ఈ బడ్జెట్లోనైనా ప్రాధాన్యత దక్కుతుందో లేదోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించి పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.
News March 16, 2026
‘స్వప్నం’ నెరవేర్చుకుంది.. 2 నెలల్లో 5 బ్యాంకు ఉద్యోగాలు

AP: బ్యాంకు ఉద్యోగం సాధించాలనే తన లక్ష్యానికి పెళ్లి అడ్డుకాదని నిరూపించారు విశాఖకు చెందిన స్వప్న. డిగ్రీ వరకు చదివిన ఈమె వివాహం తర్వాత శ్రీకాకుళం(D) జొన్నలపాడులో అత్తగారింట్లో పట్టుదలతో చదివారు. 2 నెలల వ్యవధిలోనే ఏకంగా 5 బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. JAN 15న IBPS PO, FEB 23న RBO PO, FEB 27న SBI జూనియర్ అసోసియేట్, మార్చి 2న BOBలో క్లర్క్, మార్చి 15న APGBలో క్లర్కు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
News March 16, 2026
హనుమకొండ : పరీక్ష రాసి ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

హనుమకొండ హంటర్ రోడ్డులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13న షైన్ జూనియర్ కాలేజీలో చివరి పరీక్ష రాసి బయటకు వచ్చాక స్నేహితురాలితో కలిసి ఇంటికి వెళ్తానని చెప్పి రోడ్డు దాటింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తండ్రి విజయ్ బహదూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


