News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 25, 2026
NGKL: గోవా టూర్.. ఇక రెండు రోజులే!

నాగర్ కర్నూల్ డిపో నుంచి గోవా టూర్‌కు సూపర్ లగ్జరీ బస్ నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్య ‘Way2News’ ప్రతినిధితో బుధవారం తెలిపారు. మూడు రోజుల గోవా యాత్రకు ఒక్కొక్కరికి రూ.3,500 ప్యాకేజీ ఉందని, ఈనెల 27 నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. పూర్తి వివరాలకు 94904 11590, 94904 11591 చరవాణికు సంప్రదించాలని కోరారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SHARE IT
News March 25, 2026
మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: సొంత ఊరికి దూరంగా ఉంటూ నగరాలు, పట్టణాల్లో ఉద్యోగం చేసే మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి వసతి, భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘సఖి నివాస్’ పేరిట కొత్తగా 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హాస్టల్‌లో 30 మందికి వసతి కల్పించనుంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగినులతో పాటు చదువుకునే యువతులకు తక్కువ ధరకే వసతి, భోజన సదుపాయం కల్పించనున్నారు.
News March 25, 2026
అమ్రాబాద్: లాంటానాతో ‘బ్లాక్ గోల్డ్’ ఉత్పత్తి!

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఆక్రమణ మొక్క లాంటానాను ‘బయోచార్’గా మార్చే వినూత్న పైలట్ ప్రాజెక్టును చేపట్టారు. దీనివల్ల అడవి రక్షణతో పాటు టన్నుకు రూ.7,000 ఆదాయం లభిస్తుందని ఐఎఫ్ఎస్ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. ఈ చర్యతో వన్యప్రాణుల ఆవాసాలు మెరుగుపడటమే కాకుండా స్థానిక గిరిజనులకు ఉపాధి కలుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.


