News March 29, 2024
ఎచ్చెర్ల TO విజయనగరం

ఎచ్చెర్ల నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఎచ్చెర్ల MLA టికెట్ ఆశించిన కిమిడి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడుకు ఆ పార్టీ విజయనగరంలో అవకాశం కల్పించింది. విజయనగరం ఎంపీగా కలిశెట్టి, చీపురుపల్లి ఎమ్మెల్యేగా కళా పోటీ చేయనున్నారు. ఇన్ని రోజులు ఎచ్చెర్ల స్థానం కోసం వీరిద్దరూ రెండు గ్రూపులుగా విడిపోవడంతో టీడీపీకి తలనొప్పిగా మారింది. మరి ఆ ఇద్దరూ అక్కడ ఎలా వ్యహరిస్తారో చూడాలి మరి.
Similar News
News September 9, 2025
శ్రీకాకుళం: ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర మంత్రి

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన ఓటు హక్కును మంగళవారం వినియోగించుకున్నారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించిన పోలింగ్‌ను పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించారు. పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News September 9, 2025
మాజీ మంత్రి సీదిరి హౌస్ అరెస్ట్

ఎరువుల కొరతపై రైతన్నకు బాసటగా వైసీపీ ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ, నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులను బయటకు రాకుండా చేయడం అన్యాయమని సీదిరి మండిపడ్డారు.
News September 9, 2025
శ్రీకాకుళం: టీనా మృతిపై ఎస్పీ దిగ్భ్రాంతి

పోలీసు శాఖలో 7 సంవత్సరాల పాటు విశేష సేవలందించిన పోలీసు జాగిలం ‘టీనా’ అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచింది. టీనా మృతి పట్ల ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయం ఆవరణంలో ఇవాళ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అదనపు ఎస్పీ కె.వి.రమణ తదితరులు నివాళులు అర్పించారు.