News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 25, 2026

సిద్దిపేట: పెట్రోల్, డీజిల్ కొరత లేదు

image

పెట్రోల్, డీజిల్ కొరత లేదని తప్పుడు వార్తలు నమ్మి వాహనదారులు ఆందోళనకు గురికావద్దని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి పేర్కొన్నారు. భయాందోళన కారణంగా కొనుగోళ్ల అమ్మకాలు సాధారణ కంటే 3 రెట్లు అసాధారణంగా పెరిగాయని ఫలితంగా తాత్కాలికంగా సరకు నిండుకుపోయిందన్నారు. HPCL, IOCL, BPCL వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని సరఫరా గొలుసులు సాధారణంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.

News March 25, 2026

రామ‌తీర్థం గిరి ప్రదర్శన రోడ్డును ప్రారంభించిన డిప్యుటీ సీఎం

image

రాష్ట్రంలో ఆల‌యాల ప‌విత్ర‌త‌ను సంర‌క్షించేందుకు కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర‌ ఉప‌ముఖ్య‌మంత్రి కొణిద‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. రామ‌తీర్థం నీలాచ‌లం చుట్టూ గిరి ప్ర‌ద‌ర్శ‌న కోసం రూ.3.40కోట్ల గ్రామీణ ఉపాధిహామీ నిధుల‌తో 3.7 కిలోమీట‌ర్ల మేర కొత్త‌గా నిర్మించిన గిరివ‌లయం బీటీ ర‌హ‌దారిని ప‌వ‌న్ బుధ‌వారం అమ‌రావ‌తి నుంచి వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News March 25, 2026

రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం!

image

TG: రానున్న 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎండ తగ్గుముఖం పట్టింది.