News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 22, 2026
సౌదీ అరేబియాలో నెల్లికుదురు వాసి మృతి

సౌదీ అరేబియా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఓ పేద కుటుంబంలో తీరని శోకాన్ని నింపాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన రవిగోపాల్ ఉపాధి నిమిత్తం కొంతకాలంగా సౌదీ అరేబియాలో పని చేస్తున్నారు. ఇటీవల ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం.
News March 22, 2026
త్వరలో యాదాద్రికి MMTS

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు త్వరలో రైల్వే శాఖ తీపి కబురు అందించనుంది. వచ్చే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా MMTS రెండో దశ పనులకు అంకురార్పణ జరగనుంది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 33KM మేర కొత్త లైన్ నిర్మించి, రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భక్తులు అతి తక్కువ ఖర్చుతో నేరుగా క్షేత్రానికి చేరుకోవచ్చు.
News March 22, 2026
HYD: ముంచుకొస్తోంది.. జర జాగ్రత్త!

వేసవి దృష్ట్యా HYDలో ఒక్కపూట బడులు సాగుతున్నాయి. ఈ గ్యాప్‌లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఈసరదా వెంటే విషాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీలు గతేడాది 8 మంది లోతు తెలియక, ప్రవాహ తాకిడికి మునిగిపోయారు. వేసవిలో రోజుకు నలుగురి చొప్పున ఈత సరదాకు బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. పెద్దలు, నిపుణుల సమక్షంలో పిల్లలకు ఈత నేర్పండి.


