News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 22, 2026
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో పాక్ టాప్

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో ఈసారి అగ్రస్థానంలో నిలిచింది. 2025లో ఉగ్రదాడులతో నమోదైన మరణాలు 6% పెరిగి 1,139కు చేరాయి. 2013 తర్వాత ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. పొరుగుదేశాలు.. ముఖ్యంగా అఫ్గాన్‌తో టెన్షన్స్.. TTP, BLA సంస్థల దాడులు ఇందుకు కారణాలని రిపోర్ట్ తెలిపింది. కాగా గత ఏడాది ఈ ఇండెక్స్‌లో బుర్కినో ఫాసో, పాక్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.
News March 22, 2026
ముదిగుబ్బ: ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్

ముదిగుబ్బ మండలం దొరిజిగిల్లు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పుట్టపర్తిలోని సమాధి రోడ్డులో ఉండే రాము (50) బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అతను మృతి చెందాడు. మృతుడిని 108లో ముదిగుబ్బ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 22, 2026
ఉస్తాద్ భగత్‌సింగ్ టికెట్ రేట్స్ తగ్గింపు

AP: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా టికెట్ ధరలు రాష్ట్రంలో రేపటి నుంచి తగ్గనున్నాయి. ఉగాదికి రిలీజైన ఈ మూవీకి 10రోజుల పాటు హైక్‌కు ప్రభుత్వం అనుమతించింది. అయితే TGతో సమానంగా ధరలను ఉంచేందుకు మేకర్స్ రేపటి నుంచే తగ్గించాలని డిసైడ్ అయ్యారు. టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్‌లో ₹100, మల్టీప్లెక్స్‌లలో ₹125 తగ్గనున్నాయి. దీంతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


