News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 18, 2026
జిల్లాలో షాదీ ఖానాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ శివనాథ్

విజయవాడ పశ్చిమలో షాదీ ఖానాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ శివనాథ్ హామీ ఇచ్చారు. బుధవారం చిట్టినగర్‌లో ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పటికీ ఇఫ్తార్ విందుకు హాజరై ముస్లిం సోదరులతో గడపడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడు రంజాన్‌నాటికి ఎంపీ నిధులు కేటాయించి ఎన్టీఆర్ జిల్లాలో షాదీ ఖానాలు నిర్మిస్తామన్నారు.
News March 18, 2026
నిరంతర ఎల్పీజీ సరఫరాకు కలెక్టర్ ఆదేశాలు

రబీ 2025–26 ప్యాడీ కొనుగోలు ఏర్పాట్లపై DPC సమావేశం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన జరిగింది. కొనుగోలు కేంద్రాలు, రవాణా, నిల్వ ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎల్పీజీ సరఫరా సమీక్షించి నిరంతర రీఫిల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనులకు విరుద్ధంగా వినియోగిస్తున్న 113 కేసుల్లో 160 సిలిండర్లు సీజ్ చేసినట్లు తెలిపారు.
News March 18, 2026
ఉగాది ముహూర్తం.. సమయం ఇదే..

రేపటి నుంచి ‘పరాభవ’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉ.6 గం.53 ని.ల నుంచి ఉ.9.30 వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలని పేర్కొన్నారు.


