News March 29, 2024

బొత్సను ఢీకొట్టనున్న కళా

image

ఉత్తరాంధ్రలో YCP కీలక నేత బొత్స సత్యనారాయణను TDP నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఢీకొట్టనున్నారు. బొత్సపై పోటీకి సీనియర్ అయిన కళానే బెటర్ అని TDP భావించింది. అలాగే ప్రస్తుతం TDP చీపురుపల్లి ఇన్‌ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జునకు వెంకట్రావు సొంత పెదనాన్న కావడంతో పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చని పార్టీ భావించినట్లు తెలుస్తోంది. 2014లో కళా ఎచ్చెర్ల MLAగా గెలిచారు. ఈసారి ఎచ్చెర్ల సీటు BJPకి కేటాయించారు.

Similar News

News March 13, 2026

శుక్రవారం రోజున జన్మిస్తే..

image

శుక్రవారం నాడు జన్మించినవారిపై శుక్రుడి ప్రభావం ఉంటుందని జ్యోతిషులు చెబుతున్నారు. ‘వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అపార సంపద గల యోగాన్ని కలిగి ఉంటారు. కష్టపడితే స్వయంకృషితోనే గొప్ప స్థాయికి చేరుకునే అదృష్టం ఉంటుంది. సినిమా, మీడియా రంగాల్లో రాణిస్తారు. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి ఇంకా మంచి ఫలితాలుంటాయి. వీరు రాజరాజేశ్వరి దేవిని ఆరాధించాలి. లలితా సహస్రనామ పారాయణం చేయాలి’ అని సూచిస్తున్నారు.

News March 13, 2026

SMలో పోర్నోగ్రఫీకి పిల్లలు బలి.. హర్భజన్ ఆవేదన

image

సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లలపై తీవ్రంగా పడుతోందని మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. అందులో విస్తృతంగా లభించే అసభ్యకర, పోర్నోగ్రఫీకి 12-13 ఏళ్ల పిల్లలు బలి అవుతున్నారని, వారి భవిష్యత్తు నాశనమవుతోందని పేర్కొన్నారు. యువతను సంరక్షించేందుకు వీలుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ వాడకంపై కఠిన ఆంక్షలు విధించాలని కేంద్రానికి సూచించారు.

News March 13, 2026

ఉగాది ఎప్పుడు? ఆరోజు ఏం చేయాలి?

image

ఈ ఏడాది మార్చి 19న ఉగాది జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘ఆ రోజున 3:45 AM – 5:30 AM మధ్య నిద్రలేవడం శ్రేయస్కరం. నువ్వుల నూనెతో స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించాలి. ఇంటిని మామిడి తోరణాలు, ముగ్గులతోనే కాకుండా వేప కొమ్మలతోనూ అలంకరించడం మంచిది. షడ్రుచుల పచ్చడిని తప్పక తాగాలి. ఇది ప్రకృతి ఇచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించే శక్తిని ఇస్తుంది. పంచాంగ శ్రవణంతో రాశిఫలాలు తెలుసుకోవాలి’ అంటున్నారు.