News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 10, 2026

ఏలూరు కార్పొరేషన్‌పై ACB అధికారులు దాడి

image

ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంపై మంగళవారం ACB అధికారులు దాడి చేశారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు కార్యాలయంలో రికార్డులు పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. ఉద్యోగులు ఎవరిని బయటకు కదలనీయకుండా తలుపులు మూసి తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News March 10, 2026

HEC విద్యార్థులకు ఏయే కోర్సులున్నాయంటే?

image

<<19336321>>ఇంటర్‌లో<<>> HEC పూర్తిచేసిన వారికి విభిన్నమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారు B.Aలో HEP. లిటరేచర్ B.A లాంగ్వేజెస్. జర్నలిస్టు అవ్వాలంటే B.A జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్. న్యాయవాది కావాలనుకుంటే ఐదేళ్ల BA LLB కోర్సు. టీచర్‌ అయ్యేవారికి B.A B.Ed. కంప్యూటర్స్ అంటే మక్కువ ఉంటే BCA కూడా బాగుంటుంది. ఫైన్ ఆర్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్ వైపు కూడా వెళ్లొచ్చు.

News March 10, 2026

కేజీహెచ్ వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు

image

‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీహెచ్‌కు చెందిన ఇద్దరు వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. గైనిక్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.పి.ఉషాదేవి, అనస్థీషియా విభాగాధిపతి ప్రొఫెసర్ వాసుపల్లి రవికి 10 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. స్పందించకపోతే అందుబాటులో ఉన్న ఆధారాలతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.