News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 16, 2026

భద్రాద్రి: రైల్వే లైన్‌తో పర్యాటక రంగానికి ప్రోత్సాహం

image

భద్రాద్రి అభివృద్ధికి కీలకమైన పాండురంగాపురం మల్కాన్గిరి రైల్వే లైన్‌కు అనుమతి లభించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో సారపాక వరకు భూ సేకరణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్‌కు సూచించారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే దక్షణ అయోధ్యగా ఉన్న భద్రాద్రి ప్రాంతంలో సాంస్కృతిక శోభ వెల్లి విరుస్తుందని, పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.

News March 16, 2026

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి స్థలం గుర్తించండి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 చోట్ల విమానాశ్రయాలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అక్కడ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆ ప్రాంతాలను తిరస్కరించిందని, భద్రాచలం, కొత్తగూడెం, మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుకూలమైన భూమిని గుర్తించాలని కలెక్టర్ అంకిత్‌ను ఆదేశించారు. దీనిపై సంబంధిత శాఖలు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.

News March 16, 2026

బీఆర్ఎస్ నేతలతో జీవన్ రెడ్డి చర్చలు

image

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశాలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ చర్చల తరువాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో చర్చలు జరిగినట్లు సమాచారం.